Techie Dead | హాస్టల్ బిల్డింగ్ పైనుంచి పడిన జంట.. యువతి మృతి, వ్యక్తికి తీవ్ర గాయాలు
Techie Dead | ఒక పేయింగ్ గెస్ట్ (పీజీ) హాస్టల్లో కలిసి నివసిస్తున్న ఒక జంట ఆ బిల్డింగ్ పైనుంచి కిందపడ్డారు. టెకీ అయిన యువతి మరణించగా ఆమె స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
బెంగళూరు: ఒక పేయింగ్ గెస్ట్ (పీజీ) హాస్టల్లో కలిసి నివసిస్తున్న ఒక జంట ఆ బిల్డింగ్ పైనుంచి కిందపడ్డారు. టెకీ అయిన యువతి మరణించగా ఆమె స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. (Techie Dead) కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. పుదుచ్చేరిలోని ఉలైవైక్కల్కు చెందిన 23 ఏళ్ల జనని, బెంగళూరులోని ఒక సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నది. పుదుచ్చేరిలోని నల్లతూరుకు చెందిన 30 ఏళ్ల మణిచవేలు ఒక లాజిస్టిక్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. వైట్‌ఫీల్డ్‌లోని ఈసీసీ రోడ్డులో ఉన్న కో లివింగ్ పీజీ వసతి గృహంలో వీరిద్దరూ కలిసి నివసిస్తున్నారు.
కాగా, ఆదివారం ఉదయం జనని, మణిచవేలు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో పీజీ వసతి గృహం బిల్డింగ్ అంచు వైపు జనని వెళ్లింది. అక్కడి నుంచి కిందకు దూకే సమయంలో మణిచవేలును కూడా తనతో పాటు ఆమె లాగినట్లు తెలుస్తున్నది. దీంతో వీరిద్దరూ ఏడవ అంతస్తు నుంచి కింద పడ్డారు. తీవ్రంగా గాయపడిన జనని అక్కడికక్కడే మరణించింది.
మరోవైపు మణిచవేలు మాత్రం ఆ బిల్డింగ్ ముందున్న చెట్టు కొమ్మలపై పడిన తర్వాత కిందపడ్డాడు. దీంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. గాయపడిన అతడ్ని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. టెకీ జనని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు. ఆ జంట మధ్య జరిగిన వాదనకు కారణంతో పాటు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

