బెంగళూరు : కర్ణాటకలో హిజాబ్ వివాదం నేపథ్యంలో మూసివేసిన పాఠశాలలు సోమవారం నుంచి తెరుచుకున్నాయి. 10వ తరగతి వరకు క్లాస్లు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో పిల్లలు పాఠశాలలకు తరలివెళ్తున్నారు. అయితే హిజాబ్ తొలగించిన తర్వాతే ముస్లిం విద్యార్థినులను స్కూళ్లలోకి అనుమతిస్తున్నారు. స్కూల్ బయటే టీచర్లు నిలబడి హిజాబ్ తొలగించాలని విద్యార్థినులకు సూచించారు.
కర్ణాటకలో స్కూళ్లు తెరుచుకున్నాయని, ప్రశాంత వాతావరణంలో పిల్లలకు పాఠశాలలకు వస్తున్నారని ఉడుపి జిల్లాకు చెందిన ఓ తహసీల్దార్ తెలిపారు. హైకోర్టు ఉత్తర్వులను జిల్లా అధికార యంత్రాంగం అమలు చేస్తుందన్నారు. ఉడుపి జిల్లాలో ఈ నెల 19వ తేదీ వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.
#WATCH | K'taka: Argument b/w parents & a teacher outside Rotary School in Mandya as she asked students to take off hijab before entering campus
A parent says,"Requesting to allow students in classroom, hijab can be taken off after that but they're not allowing entry with hijab" pic.twitter.com/0VS57tpAw0
— ANI (@ANI) February 14, 2022