శనివారం 06 జూన్ 2020
National - May 13, 2020 , 08:47:33

50 శాతం కూలీల‌తో తేయాకు సేక‌ర‌‌ణ

50 శాతం కూలీల‌తో తేయాకు సేక‌ర‌‌ణ

ప‌శ్చిమ‌బెంగాల్ : లాక్ డౌన్ కొన‌సాగుతుండ‌టంతో కూలీలు లేక ప‌నులు నిలిచిపోయిన విష‌యం తెలిసిందే. అయితే జోన్ల వారిగా కొన్ని స‌డ‌లింపులు ఇవ్వ‌డం, వ్య‌వ‌సాయ అనుబంధ‌రంగాలకు మిన‌హాయింపు ఇవ్వ‌డంతో ప‌నులు షురూ అవుతున్నాయి.

ప‌శ్చిమ‌బెంగాల్ లోని సిరిగురి జిల్లాలో తేయాకు సేక‌ర‌ణ ప్రారంభమైంది. దాగ‌పూర్ టీ ఎస్టేట్ లో 50 శాతం మంది కూలీల‌తో ప‌నులు షురూ అయ్యాయి. టీ ఎస్టేట్ మేనేజ‌ర్ మాట్లాడుతూ..ప్రభుత్వం త్వ‌రలోనే 100 శాతం కూలీల‌తో ప‌నులు చేసుకునే అవ‌కాశం క‌ల్పిస్తుంద‌ని ఆశిస్తున్నాం. అలా అయితే మాకు చాలా ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటుంద‌న్నాడు. 
ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo