శబరిమల: శబరిమల అయ్యప్ప దేవాలయానికి చేరుకోవడానికి పుల్లుమేడు, ఎరుమేలి అటవీ మార్గాల్లో కాలినడకన ప్రయాణించే భక్తులకు త్వరిత దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ‘ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డ్’ సోమవారం ప్రకటించింది. అటవీ దారుల్లో ప్రయాణించిన భక్తులకు ‘ప్రత్యేక దర్శనం’ సౌకర్యం కల్పించబోతున్నట్టు బోర్డ్ అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ మీడియాకు తెలిపారు.