TCS Nashik : నాసిక్‌లోని టీసీఎస్ క్యాంపస్‌లో ఇటీవల లైంగిక వేధింపులు, మత మార్పిడి ప్రయత్నం వంటి ఘటన బయటపడిన సంగతి తెలిసిందే. నాసిక్‌లోని టీసీఎస్ బీపీవో యూనిట్లో తమను కొందరు ముస్లిం యువకులు, ఒక యువతి కలిసి మతం మారాలని ఒత్తిడి తేవడంతోపాటు, లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు ఎనిమిది మంది అమ్మాయిలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు ఈ ఆరోపణలు నిజమే అని గుర్తించి నిందితులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
ఈ నేపథ్యంలో నాసిక్‌లోని టీసీఎస్ క్యాంపస్‌లో గందరగోళ పరిస్థితి ఎదురైంది. అందుకే ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సదుపాయం కల్పిస్తూ టీసీఎస్ ఆదేశాలు జారీ చేసింది. అక్కడి 150 మంది ఉద్యోగులకు ఈ అంశంపై ఆదేశాలు జారీ చేసింది. గురువారం నుంచి వర్క్ ఫ్రం హోం వర్తిస్తుంది. నాసిక్ కేసుకు సంబంధించి ఈ దారుణానికి ప్రధాన సూత్రధారి అక్కడి హెచ్ఆర్ మేనేజరే అని తేలింది. సీనియర్ల వేధింపులపై బాధితులు హెచ్ఆర్కు ఫిర్యాదు చేసినప్పటికీ ఆమె వాటిని పట్టించుకోలేదు. పైగా, నిందితులకే మద్దతుగా మాట్లాడింది. బాధితుల ఫిర్యాదుల్ని తొక్కిపెట్టడం, అవి పై అధికారుల వరకు వెళ్లకుండా చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఈ ఘటనల్లో ఆమే మాస్టర్ మైండ్ అని పోలీసులు అంటున్నారు.
ఈ కేసుకు సంబంధించి 78 అనుమానిత కాల్ రికార్డ్స్, మెయిల్స్, చాట్స్‌ను పోలీసులు కనుగొన్నారు. ఈ కేసు విచారణ కోసం ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. టీసీఎస్ సంస్థ కూడా దీనిపై స్పందించింది. ఈ ఘటనల్ని తాము సమర్ధించబోమని, తమ ఆఫీసుల్లో వేధింపుల్ని ఉపేక్షించబోమని స్పష్టం చేసింది. నిందితుల్ని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.