TCS Nashik | ఇంకా పరారీలోనే టీసీఎస్ నాసిక్ ఘటన నిందితురాలు నిదాఖాన్.. లొకేషన్ పంపిన భర్త.. కానీ
TCS Nashik : నాసిక్ టీసీఎస్ లైంగిక వేధింపుల కేసులో కీలక నిందితురాలిగా ఉన్న నిదాఖాన్ ఇంకా పరారీలోనే ఉంది. ఆమె ఆచూకీ కనుగొనేందుకు ఇంకా పోలీసులు ప్రయత్నిస్తూనే ఉన్నారు.
TCS Nashik : నాసిక్ టీసీఎస్ లైంగిక వేధింపుల కేసులో కీలక నిందితురాలిగా ఉన్న నిదాఖాన్ ఇంకా పరారీలోనే ఉంది. ఆమె ఆచూకీ కనుగొనేందుకు ఇంకా పోలీసులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. చివరకు ఆమె భర్త చెప్పిన చోట కూడా ఆమె ఆచూకీ లభించలేదు. మహారాష్ట్ర, నాసిక్లోని టీసీఎస్ క్యాంపస్లో కొందరు సీనియర్ ఉద్యోగులు.. అక్కడి మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అలాగే, బలవంతంగా మతం మార్చేందుకు ప్రయత్నించారు.
దీంతో బాధిత మహిళలు చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో ఎనిమిది మందిని అరెస్టు చేశారు. వీరిలో ఒక మహిళ కూడా ఉన్నారు. మరో ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ మాత్రం పరారీలో ఉంది. ఘటన జరిగి వారం రోజులు దాటిపోయినా ఆమె ఆచూకీ లభించలేదు. ప్రస్తుతం పోలీసుల అంచనా ప్రకారం నిదాఖాన్ రెండు నెలల క్రితమే మహారాష్ట్రలోని ముంబ్రా ప్రాంతం చేరుకున్నట్లు అనుమానిస్తున్నారు. నిదాఖాన్ ఆచూకీ లభించకపోయినప్పటికీ ఆమె భర్త మాత్రం పోలీసులకు అందుబాటులోకి వచ్చాడు. నిదాఖాన్ కొంతకాలం క్రితమే బంధువుల ఇంటికి వెళ్లిపోయినట్లు చెబుతున్నాడు. ఆ ఇంటికి సంబంధించి వివరాలు ఇచ్చాడు. కానీ, పోలీసులు అక్కడికి వెళ్లేసరికి ఆ ఇంటికి తాళం వేసి ఉంది.
ఆమెతోపాటు ఇంట్లో ఉండే బంధువుల ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్ వస్తున్నాయి. అయితే, ఆమె ముంబ్రాలో ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ కేసు విచారణ కోసం మూడు పోలీసు బృందాలు పని చేస్తున్నాయి. ఒక టీం ప్రస్తుతం ముంబ్రాలో ఉంది. అయితే, నిదాఖాన్ ప్రస్తుతం గర్భిణి అని, ఈ నేపథ్యంలో బెయిల్ కోసం దరఖాస్తు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇలాంటి వేధింపుల్ని తాము సమర్ధించబోమని టీసీఎస్ ప్రకటించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

