న్యూఢిల్లీ, మే 27: బ్లాక్ ఫంగస్ చికిత్సలో ఉపయోగిస్తున్న ‘యాంఫోటెరిసిన్ బీ’ ఔషధాన్ని కస్టమ్స్ డ్యూటీ లేకుండానే దిగుమతి చేసుకోవడానికి ఢిల్లీ హైకోర్టు అనుమతించింది. ఈ పన్ను రద్దుపై కేంద్రం నిర్ణయం తీసుకునే వరకు మాత్రమే తమ ఆదేశాలు అమల్లో ఉంటాయని తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కొంతమంది బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యాధి నివారణకు ‘యాంఫోటెరిసిన్ బీ’ ఔషధాన్ని ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఔషధాల కొరత వేధిస్తున్నది.