అమృత్సర్: ఖలిస్థాన్ అనుకూలవాది అమృత్పాల్ సింగ్ తండ్రి తార్సెమ్ సింగ్ పంజాబ్లో ఓ రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు. ఆయన ఆదివారం స్వర్ణ దేవాలయంలో ప్రార్థనల అనంతరం ఈ విషయాన్ని వెల్లడించారు. అమృత్పాల్ పంజాబ్లోని ఖదూర్ సాహిబ్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఆయనపై జాతీయ భద్రత చట్టం ప్రకారం కేసు నమోదైంది. ఆయన ప్రస్తుతం అస్సాంలోని దిబ్రుగఢ్ జైలులో ఉన్నారు. పంజాబ్లో నా లుగు శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు త్వరలో జరుగుతాయి. ఈ తరుణంలో తార్సెమ్ ఈ ప్రకటన చేశారు.