Mallikarjun Kharge | మైనారీటీలను లక్ష్యంగా చేసుకోవడం, బుల్డోజర్లను ఉపయోగించడం ఆందోళనకరం: మల్లికార్జున్ ఖర్గే
Mallikarjun Kharge | మైనారిటీలను బీజేపీ లక్ష్యంగా చేసుకుంటోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. వారిలో భయాన్ని కలిగించడానికి బుల్డోజర్లను ఉపయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మైనారిటీల ఇళ్లపై బుల్డోజర్ చర్యను ఖర్గే ఖండించారు.
న్యూఢిల్లీ: మైనారిటీలను బీజేపీ లక్ష్యంగా చేసుకుంటోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) విమర్శించారు. వారిలో భయాన్ని కలిగించడానికి బుల్డోజర్లను ఉపయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మైనారిటీల ఇళ్లపై బుల్డోజర్ చర్యను ఖర్గే ఖండించారు. శనివారం ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘ఒకరి ఇంటిని కూల్చివేయడం. వారి కుటుంబాన్ని నిరాశ్రయులను చేయడం అమానవీయం, అన్యాయం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మైనారిటీలపై పదే పదే దాడులు జరుగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రూల్ ఆఫ్ లా ప్రకారం పరిపాలించే సమాజంలో ఇలాంటి చర్యలకు చోటు లేదు’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.
కాగా, సహజ న్యాయాన్ని అరాచకం భర్తీ చేయదని మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. నేరస్తులను కోర్టుల ద్వారా శిక్షించాలని, రాష్ట్రాల బలవంతం ప్రకారం కాదని అన్నారు. బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని నిర్మొహమాటంగా విస్మరిస్తున్నాయని మండిపడ్డారు. ‘పౌరులలో భయాన్ని కలిగించడానికి బుల్డోజింగ్ను ఉపయోగించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అరాచకం సహజ న్యాయాన్ని భర్తీ చేయదు. నేరాలపై కోర్టులు తీర్పులిస్తాయి. ప్రభుత్వం ప్రాయోజిత బలవంతం ద్వారా కాదు’ అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. భోపాల్‌లో పోలీసు అధికారులను లక్ష్యంగా చేసుకుని రాళ్లదాడికి పాల్పడిన ఘటనలో ప్రధాన నిందితుడైన కాంగ్రెస్ నేత హాజీ షెహజాద్ అలీకి చెందిన బంగ్లాను అధికారులు ఇటీవల కూల్చేశారు. ఈ నేపథ్యంలో మల్లికార్జున్ ఖర్గే ఈ మేరకు స్పందించారు.
Demolishing someone's home and rendering their family homeless is both inhumane and unjust. The repeated targeting of minorities in BJP-ruled states is deeply troubling. Such actions have no place in a society governed by the Rule of Law.
The Congress Party strongly condemns the…
— Mallikarjun Kharge (@kharge) August 24, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

