చెన్నై యువకుడి గుండె కశ్మీరీ మహిళకు దానం
హైదరాబాద్ : హృద్రోగ సమస్యతో బాధపడుతున్న ఓ కశ్మీరీ మహిళకు బ్రెయిన్‌డెడ్‌తో గురైన చెన్నై యువకుడి గుండెను అమర్చి ప్రాణం పోశారు వైద్యులు. ప్రస్తుతం ఆ మహిళ పూర్తిగా కోలుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఏడాది జనవరి 26వ తేదీన ఆమెకు వైద్యులు హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. జమ్మూకశ్మీర్‌కు చెందిన 33 ఏండ్ల మహిళ ఫాతిమా గతకొంత కాలం నుంచి గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆమెను చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించారు. అయితే బాధిత మహిళకు హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ తప్పనిసరి అని వైద్యులు స్పష్టం చేశారు. తమిళనాడులోని తిరుచ్చిలో ఓ 18 ఏండ్ల యువకుడు జనవరి 26వ తేదీన బ్రెయిన్ డెడ్‌కు గురయ్యాడు. ఆ యువకుడిని గుండెను దానం చేసేందుకు ఐశ్వర్య ట్రస్ట్ సభ్యులు ఆ కుటుంబాన్ని ఒప్పించారు. అనంతరం 350 కిలోమీటర్ల మేర గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి తిరుచ్చి నుంచి చెన్నై ఎంజీఎంకు గుండెను తరలించారు. అదే రోజు ఫాతిమాకు ఈ యువకుడి గుండెను అమర్చారు. ప్రస్తుతం ఆమె పూర్తిగా కోలుకున్నది. గుండెను దానం చేసిన ఆ యువకుడి కుటుంబ సభ్యులకు ఫాతిమా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

