బెంగళూరు: తమిళనాడులోని ఓ సామాజిక సంస్థ పెరియార్ విగ్రహంతో కూడిన రాజదండాన్ని కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు శనివారం బహూకరించింది. మధురైకి చెందిన ‘మక్కల్ సముఘ నిధి పెరవాయ్’ సభ్యులు కర్ణాటకలో సామాజిక న్యాయాన్ని కాపాడాలని కోరుతూ ఈ రాజదండాన్ని సీఎం కార్యాలయంలో సిద్దరామయ్యకు అందజేశారు. దీన్ని పెరియార్ ప్రతిమతో తమిళనాడులో తయారు చేయించారు.