న్యూఢిల్లీ: తమిళనాడు ప్రభుత్వం వన్నియార్ వర్గానికి కేటాయించిన 10.5 శాతం కోటాను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఇవాళ ఈ కేసును సుప్రీం విచారించింది. ప్రభుత్వ ఉద్యోగులు, విద్యా సంస్థల్లో వన్నియార్ కులస్తులకు తమిళనాడు ప్రభుత్వం 10.5 శాతం కోటాను కేటాయించింది. వాస్తవానికి ఆ కోటాను మద్రాస్ హైకోర్టు రద్దు చేసింది. ఆ ఆదేశాలను ఇవాళ సుప్రీం సమర్థించింది. జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు, బీఆర్ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం ఇవాళ తీర్పును ఇచ్చింది. వన్నియాకుల క్షత్రియులను మరో గ్రూపుగా చూడలేమని, ఎంబీసీ గ్రూపులో ఉన్న 115 కులాలతో ఆ వర్గం కలిసి ఉండాల్సిందే అని సుప్రీం బెంచ్ తెలిపింది.