బుధవారం 08 జూలై 2020
National - Jun 22, 2020 , 19:40:44

త‌మిళ‌నాడులో కొత్త‌గా 2,710 కేసులు.. 37 మంది మృతి

త‌మిళ‌నాడులో కొత్త‌గా 2,710 కేసులు.. 37 మంది మృతి

చెన్నై : త‌మిళ‌నాడు రాష్ర్ట ప్ర‌జ‌ల‌ను క‌రోనా వైర‌స్ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అక్క‌డ రోజురోజుకు క‌రోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. సోమ‌వారం ఒక్క‌రోజే కొత్త‌గా 2,710 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 37 మంది మ‌ర‌ణించారు. దీంతో ఆ రాష్ర్టంలో మ‌ర‌ణాల సంఖ్య 794కు చేరుకోగా, పాజిటివ్ కేసుల సంఖ్య 62,087కు చేరింది. ఇందులో యాక్టివ్ కేసులు 27,178. 

చెన్నైలో అత్య‌ధికంగా 41,172, చెంగ‌ల్ ప‌ట్టులో 3,745, తిరువ‌ల్లూరులో 2,534, కంచీపురంలో 1,159, తిరువ‌న్న‌మ‌లైలో 1,060 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. 


logo