Aliens Temple | చెన్నై: తమిళనాడులోని సేలం, మల్లమూపంబట్టిలో ఏలియన్స్‌కు ఓ గుడిని నిర్మించారు. శివపార్వతులు, మురుగన్, కాళి మాత విగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు. 11 అడుగుల లోతైన నేల మాళిగలో ఈ గుడిని నిర్మించారు. ఈ వార్త చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించడంతో రోజూ వందలాది మంది వచ్చి దర్శించుకుంటున్నారు.
ఈ గుడిని నిర్మించిన లోగనాథన్ మాట్లాడుతూ, తాను గ్రహాంతర దేవతలతో మాట్లాడానని చెప్పారు. ఈ గుడిని నిర్మించేందుకు వారి నుంచి అనుమతి పొందానన్నారు. ప్రకృతి వైపరీత్యాలను గ్రహాంతర దేవతలు కాపాడగలవని తాను విశ్వసిస్తున్నట్లు తెలిపారు.