Lock down: తమిళనాడులో కంప్లీట్ లాక్డౌన్.. శుభకార్యాలకు వెళ్లొచ్చట..!
Lock down: తమిళనాడులో ఇవాళ కంప్లీట్ లాక్డౌన్ కొనసాగుతున్నది. దాంతో రాజధాని చెన్నై సహా పలు పట్టణాల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. రాష్ట్రంలో కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతుండటంతో

చెన్నై: తమిళనాడులో ఇవాళ కంప్లీట్ లాక్డౌన్ కొనసాగుతున్నది. దాంతో రాజధాని చెన్నై సహా పలు పట్టణాల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. రాష్ట్రంలో కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతుండటంతో అక్కడి ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రతిరోజు నైట్ కర్ఫ్యూ, ఆదివారాల్లో కంప్లీట్ లాక్డౌన్ను అమలు చేస్తున్నది. జనవరి 31 వరకు ఈ నైట్ కర్ఫ్యూ, కంప్లీట్ లాక్డౌన్ కొనసాగనుంది.
ప్రతిరోజు రాత్రి 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం 1,31,007 కొవిడ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 36,967 కరోనా మరణాలు సంభవించాయి. అదేవిధంగా 27,47,974 మంది మహమ్మారి బారినపడి కోలుకున్నారు. తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి ఎంఏ సుబ్రమణియన్ ఆదివారం ఉదయం ఈ వివరాలను వెల్లడించారు.

లాక్డౌన్లో వీటికి అనుమతి..
ఆదివారాలు కంప్లీట్ లాక్డౌన్ అమల్లో ఉన్నప్పటికి పెండ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు వెళ్లొచ్చట. అయితే, పోలీసులు ఎక్కడ అడిగినా సంబంధిత ఇన్వెటేషన్ కార్డును చూపించాలి. అదేవిధంగా పెండ్లిళ్లకు 100 మందికి మించి హాజరు కాకూడదు. ఆస్పత్రులు, ఫార్మసీలు, ఏటీఎం కేంద్రాలు, పెట్రోల్, డీజిల్ బంకులు వంటి అత్యవసర సేవలు యథావిథిగా కొనసాగుతాయి. రెస్టారెంట్లు ఫుడ్ డెలివరీ సేవలు అందించేందుకు అనుమతి ఉంది. అన్ని ప్రార్థనా మందిరాలు మూసి ఉంటాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Chennai
- Lock down
- Tamil Nadu
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Army | ఇండియన్ ఆర్మీకి అందిన 450 నాగాస్త్ర-1 ఆర్ డ్రోన్లు.. ఒకే దశలో అందించిన సంస్థ
Balmuri Venkat | కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భూకబ్జాపై సీపీఎం నాయకుల ఆందోళన.. వీడియో
Yuvraj Singh | మొన్నటి వరకు మెంటర్.. ఇప్పుడు బ్యాటింగ్ కోచ్గా యువరాజ్..!
L Murugan | కేంద్ర మంత్రి పదవికి ఎల్ మురుగన్ రాజీనామా.. బీజేపీని తమిళనాడులో బలోపేతం చేసేందుకేనని ప్రకటన
Farmers Protest | విద్యుత్ సిబ్బంది పట్టించుకోవడం లేదు.. కరెంటు కోసం రైతుల రాస్తారోకో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

