చెన్నై: దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టడంతో వివిధ రాష్ట్రాలు పాఠశాలలు, కళాశాలలను పునఃప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. తాజాగా తమిళనాడు ప్రభుత్వం కూడా 9 నుంచి 12 వ తరగతి విద్యార్థుల కోసం బడులు తెరిచేందుకు ( Schools reopen ) అనుమతించింది. సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలను ప్రారంభించనున్నట్లు తమిళనాడు విద్యాశాఖ వెల్లడించింది.
అయితే, పాఠశాలల్లో కొవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేయనున్నట్లు విద్యాశాఖ పేర్కొన్నది. విద్యార్థులు, టీచర్లు, ఇతర సిబ్బంది కచ్చితంగా వ్యాక్సిన్ చేయించుకుని ఉండాలని ఆదేశించింది. వ్యాక్సిన్ వేయించుకోని టీచర్లు, విద్యార్థులను స్కూళ్లలోకి అనుమతించబోమని స్పష్టంచేసింది.