శనివారం 15 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 15:38:07

కాంగ్రెస్ ఎంపీల సేవ్ డెమొక్రసీ ప్ర‌ద‌ర్శ‌న‌

కాంగ్రెస్ ఎంపీల సేవ్ డెమొక్రసీ ప్ర‌ద‌ర్శ‌న‌

చెన్నై‌: రాజస్థాన్‌లో తలెత్తిన రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో తమిళనాడు కాంగ్రెస్ ఎంపీలు, జిల్లా కార్యదర్శులు 'సేవ్ డెమోక్రసీ అండ్ సేవ్ కాన్‌స్టిట్యూష‌న్'‌ పేరుతో ప్రదర్శన నిర్వహించారు. బీజేపీకి వ్యతిరేకంగా చెన్న‌లోని రాజ్‌‌భవన్‌కు సమీపంలో సోమవారం ఈ నిరసన ప్రదర్శన చేప‌ట్టారు. కేంద్రంలో అధికారంలో ఉన్న‌ బీజేపీ చర్యలను వ్యతిరేకిస్తూ, రాజస్థాన్ ప్రభుత్వానికి మద్దతుగా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరుపాలని కాంగ్రెస్ అధిష్ఠానం పిలుపునిచ్చిన నేపథ్యంలో తమిళనాడు కాంగ్రెస్ ఈ నిరసన ప్రదర్శన జరిపింది.

కాగా, రాజస్థాన్‌లోని పరిణమాలపై కాంగ్రెస్ పార్టీ అవ‌స‌ర‌మైతే రాష్ట్రపతిని కలుస్తుందని, ఇంకా అవసరమైతే ప్రధాని నివాసం వెలుపల నిరసన ప్రదర్శన చేపడుతుంద‌ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శనివారం ప్రకటించారు. గెహ్లాట్, సచిన్‌పైల‌ట్‌ మధ్య విభేదాలు రచ్చకెక్కడంతో రాజస్థాన్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పైలట్‌ను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. కాగా, బీజేపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న‌ద‌ని కాంగ్రెస్ ఆరోపిస్తుండగా, ఆ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo