చెన్నై : తమిళనాడులోని మయిలదుతురాయ్ జిల్లా కలెక్టర్ ఏపీ మహాభారతిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఈ జిల్లాలో మూడున్నరేండ్ల బాలికపై ఓ టీనేజర్(16) లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఈ నేపథ్యంలో మహాభారతి బాలలపై లైంగిక దాడుల పట్ల అవగాహన కల్పించే కార్యక్రమంలో శుక్రవారం మాట్లాడారు. తనకు అందిన నివేదికను బట్టి ఆ బాలిక తప్పుగా ప్రవర్తించిందని చెప్పారు. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీంతో ప్రభుత్వం మహా భారతిని బదిలీ చేసింది.