Amma Canteens | తమిళనాడు సీఎం విజయ్ కీలక నిర్ణయం.. అమ్మ క్యాంటీన్ల పునరుద్ధరణకు ఆదేశం
Amma Canteens | తమిళనాడు సీఎం విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ రాష్ట్రంలోని అమ్మ క్యాంటీన్ల నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. వాటిని పునరుద్ధరించాలని, న్యాణమైన ఆహారం అందించాలని ఆదేశించారు.
చెన్నై: తమిళనాడు సీఎం విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ రాష్ట్రంలోని అమ్మ క్యాంటీన్ల నిర్వహణపై (Amma Canteens) అధికారులతో సమీక్షించారు. వాటిని పునరుద్ధరించాలని, న్యాణమైన ఆహారం అందించాలని ఆదేశించారు. 2013లో అన్నాడీఎంకే అధికారంలో ఉన్నప్పుడు నాటి సీఎం జయలలిత పుట్టిన రోజు సందర్భంగా ఫిబ్రవరి 24న ‘అమ్మ’ క్యాంటీన్లను ప్రారంభించారు. మొదట చెన్నైలో ప్రారంభమైన ఈ క్యాంటీన్లు, ఆ తర్వాత పలు నగరాలు, పట్టణాలకు విస్తరించాయి. ప్రజలకు రాయితీ ధరలకు ఆహారాన్ని అందించే ‘అమ్మ’ క్యాంటీన్లు లేదా ‘ఉణవగాలయం’ విశేష ఆదరణ పొందాయి.
కాగా, జయలలిత మరణం తర్వాత అధికారంలోకి వచ్చిన డీఎంకే ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని కొనసాగించింది. సెమీ అర్భన్ ప్రాంతాల్లో కూడా దశలవారీగా మరో 200 క్యాంటీన్లను ప్రారంభిస్తామని ప్రకటించింది. అంతేగాక ఈ పథకం పేరును కూడా డీఎంకే ప్రభుత్వం మార్పు చేయలేదు.
మరోవైపు తమిళనాడులో కొత్తగా అధికారంలోని వచ్చిన టీవీకే ప్రభుత్వం కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగించాలని నిర్ణయించింది. సోమవారం సీఎం విజయ్ అమ్మ క్యాంటీన్ల నిర్వహణపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని, వాటిని పునరుద్ధరించాలని, ప్రజలకు రుచికరమైన, నాణ్యమైన ఆహారం లభించేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

