చెన్నై, మే 13: తన వ్యక్తిగత జ్యోతిష్యుడిని ఓఎస్డీగా నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రద్దు చేశారు. ప్రముఖ జ్యోతిష్యుడు రికీ రాధన్ పండిట్ వెట్రివెల్ను సీఎం కార్యాలయ ఓఎస్డీగా విజయ్ నియమించడంపై ఇటు కూటమి పార్టీలు, అటు విపక్ష పార్టీల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత రావడంతో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు.
టీవీకే కూటమిలోని వీసీకే, సీపీఐ, సీపీఎం తదితర పార్టీలు విజయ్ నిర్ణయాన్ని బహిరంగంగానే విమర్శించాయి. మన ప్రభుత్వం శాస్త్రీయ దృక్పథానికి ప్రాధాన్యత ఇవ్వాలే తప్ప ఇలా జ్యోతిష్యులకు కాదని వారు పేర్కొన్నారు.