MK Stalin | జపాన్‌లోని బుల్లెట్ ట్రైన్లో ప్రయాణించిన స్టాలిన్.. భారతీయులకు అందుబాటులోకి రావాలని ఆకాంక్ష
MK Stalin | బుల్లెట్ రైలుకు సమానమైన రైళ్లు, డిజైన్ పరంగానే కాకుండా వేగం, నాణ్యతతో కూడిన రైల్వే సేవలు భారతీయులకు కూడా అందుబాటులోకి రావాలని ఎంకే స్టాలిన్ ఆకాంక్షించారు. అలాగే పేద, మధ్యతరగతి ప్రజలు ప్రయోజనం పొందాలని, వారి ప్రయాణం సులభతరం కావాలని పేర్కొన్నారు.
చెన్నై: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin) అధికార పర్యటన నిమిత్తం జపాన్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆదివారం ఆ దేశంలోని బుల్లెట్ ట్రైన్లో ఆయన ప్రయాణించారు. ఒసాకా నుంచి జపాన్ రాజధాని టోక్యో నగరం మధ్య ఉన్న 500 కిలోమీటర్ల దూరాన్ని బుల్లెట్ ట్రైన్లో కేవలం రెండున్నర గంటల్లోపు చేరుకున్నట్లు తెలిపారు. బుల్లెట్ రైలులో ప్రయాణించిన ఫొటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
అలాగే భారత్‌కు ఒక సందేశాన్ని కూడా ఎంకే స్టాలిన్ ఇచ్చారు. బుల్లెట్ రైలుకు సమానమైన రైళ్లు, డిజైన్ పరంగానే కాకుండా వేగం, నాణ్యతతో కూడిన రైల్వే సేవలు భారతీయులకు కూడా అందుబాటులోకి రావాలని ఆయన ఆకాంక్షించారు. పేద, మధ్యతరగతి ప్రజలు ప్రయోజనం పొందాలని, వారి ప్రయాణం సులభతరం కావాలని అందులో పేర్కొన్నారు. ‘ఫ్యూచర్ ఇండియా’ అంటూ హ్యాష్‌ట్యాగ్ ఇచ్చారు.
కాగా, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన ‘వందే భారత్’ రైళ్లపై విమర్శలు కొనసాగుతున్నాయి. వేగంతో పోల్చితే శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ రైళ్లతో ఇవి పోటీ పడలేకపోతున్నాయి. అలాగే పశువులు ఢీకొనడం వంటి చిన్న ప్రమాదాలకే వందే భారత్ రైలు ఇంజిన్ ముందు భాగాలు ధ్వంసమయ్యాయి. మరోవైపు వందే భారత్ రైలు ప్రయాణ ఛార్జీలు కూడా పేదలు, మధ్య తరగతి ప్రజలు భరించలేని స్థాయిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ జపాన్ పర్యటన సందర్భంగా అక్కడి బుల్లెట్ ట్రైన్స్ డిజైన్, వేగంతోపాటు సేవల్లో నాణ్యత గురించి తన ట్వీట్లో ప్రస్తావించారు. తమిళనాడుకు పెట్టుబడుల కోసం సింగపూర్, జపాన్‌లో ఆయన పర్యటిస్తున్నారు.
ஒசாகா நகரிலிருந்து டோக்கியோவுக்கு #BulletTrain-இல் பயணம் செய்கிறேன். ஏறத்தாழ 500 கி.மீ தூரத்தை இரண்டரை மணிநேரத்திற்குள் அடைந்துவிடுவோம்.
உருவமைப்பில் மட்டுமல்லாமல் வேகத்திலும் தரத்திலும் #BulletTrain-களுக்கு இணையான இரயில் சேவை நமது இந்தியாவிலும் பயன்பாட்டுக்கு வர வேண்டும்; ஏழை -… pic.twitter.com/bwxb7vGL8z
— M.K.Stalin (@mkstalin) May 28, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahela Jayawardene | హెడ్ కోచ్ జయవర్ధనేతో బంధానికి తెర.. కొత్త హెడ్‌కోచ్ కోసం ముంబై ఇండియన్స్ కసరత్తు..!
Blue Drum Case | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితురాలికి మరణశిక్ష.. 10 నెలల కూతురు పరిస్థితి ఏంటి
I Hate Marriage | ‘ఐ హేట్ మ్యారేజ్’ టీజర్ విడుదల.. జెన్ జీ ఆలోచనలతో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్!
MLA Anil Jadhav | సోయాబిన్ కొనుగోళ్లు సక్రమంగా చేపట్టాలి : ఎమ్మెల్యే అనిల్ జాదవ్
Vigilance Raids | గద్వాల జిల్లాలో రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారుల దాడులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

