MK Stalin | తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కొత్త పథకం.. 30 రోజుల్లో ప్రజల ఫిర్యాదులు పరిష్కారం
MK Stalin | తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin) కొత్త పథకాన్ని ప్రారంభించారు. ‘మక్కలుదన్ ముతల్వార్’ స్కీమ్ ద్వారా ప్రజల ఫిర్యాదులు 30 రోజుల్లో పరిష్కరిస్తామని తెలిపారు. తన ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ పథకం అమలవుతుందని అన్నారు.
చెన్నై: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin) కొత్త పథకాన్ని ప్రారంభించారు. ‘మక్కలుదన్ ముతల్వార్’ స్కీమ్ ద్వారా ప్రజల ఫిర్యాదులు 30 రోజుల్లో పరిష్కరిస్తామని తెలిపారు. తన ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ పథకం అమలవుతుందని అన్నారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో ‘మక్కలుదన్ ముతల్వార్’ అనే కొత్త కార్యక్రమాన్ని సీఎం ఎంకే స్టాలిన్ సోమవారం ప్రారంభించారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడడం, విధానపరమైన జాప్యాలు తగ్గించడం ఈ పథకం ఉద్దేశమని తెలిపారు. త్వరితగతిన ఫిర్యాదులను పరిష్కరించడంతోపాటు సమర్పించాల్సిన పత్రాల సంఖ్యను తగ్గిస్తామని చెప్పారు. శిబిరాల్లో అందిన అర్జీలన్నింటినీ పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ‘30 రోజుల్లో ప్రజల సమస్యలు పరిష్కరిస్తాం. నా ప్రత్యక్ష పర్యవేక్షణలో పథకం అమలు చేస్తాం. వికలాంగులు, వృద్ధుల ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతాం’ అని స్టాలిన్ అన్నారు.
కాగా, ‘మక్కలుదన్ ముతల్వార్’ స్కీమ్ కోసం తమిళనాడు వ్యాప్తంగా రెండు దశల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నారు. తుపాను వల్ల బాగా ప్రభావితమైన చెన్నై, చెంగల్పట్టు, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో తొలి దశ క్యాంపులు ఏర్పాటు చేస్తారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పట్టణాలు, గ్రామ పంచాయతీల్లో సుమారు 1,745 ఫిర్యాదు పరిష్కార శిబిరాలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

