చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి ఆయన తనయుడు ఎంకే స్టాలిన్ ఘనంగా నివాళులు అర్పించారు. కరుణానిధి 98వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కరుణానిధి తమిళనాడు రాజకీయాల్లో చెరిగిపోని ముద్రవేశారు. డీఎంకే పేరిట పార్టీని స్థాపించి పలుమార్లు ముఖ్యమంత్రి అయ్యారు. కరుణానిధి మరణం తర్వాత తొలిసారి ఆయన తనయుడు స్టాలిన్ ఇప్పుడు పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 234 సీట్లకుగాను డీఎంకే 160 స్థానాల్లో విజయం సాధించింది.
Chennai | Tamil Nadu Chief Minister MK Stalin pays floral tribute to his father and former CM M Karunanidhi on his 98th birth anniversary pic.twitter.com/SkrSY1vTSg
— ANI (@ANI) June 3, 2021