చెన్నై: తమిళనాడులోని ప్రముఖ ముదరై ఆలయం సమీపంలో అక్రమ మైనింగ్ జరుగుతున్నదని ఆ రాష్ట్ర బీజేపీ కార్యదర్శి వినోజ్ పీ సెల్వం ఆరోపించారు. (illegal mining near Madurai) అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌కు సవాలు చేశారు. మదురై జిల్లాలోని అలంగనల్లూర్ చుట్టుపక్కల ఉన్న రాతి ప్రాంతాల్లో, ముఖ్యంగా కొండయంపట్టి గ్రామంలోని వాగుతుమలై, వన్నతిమలై కొండల్లో పగలు, రాత్రి వేళల్లో అనధికార మైనింగ్ జరుగుతున్నదని వినోజ్ పీ సెల్వం ఆరోపించారు. పొరుగున ఉన్న దిండిగల్ జిల్లా వరకు ఈ తవ్వకాలు విస్తరించాయని విమర్శించారు. ఇక్కడ జరుగుతున్న అక్రమ పేలుళ్ల వల్ల ఈ ప్రాంత వాసులతోపాటు వన్యప్రాణులకు తీవ్ర ముప్పు కలుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
కాగా, ఈ ప్రాంతంలో ప్రతిపాదిత టంగ్స్టన్ మైనింగ్ ప్రాజెక్టును డీఎంకే ప్రభుత్వం నిలిపివేసినట్లు సీఎం ఎంకే స్టాలిన్ గొప్పులు పోయారని బీజేపీ నేత వినోజ్ పీ సెల్వం గుర్తు చేశారు. అయితే అక్రమ మైనింగ్ నియంత్రణపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ‘మదురై, పరిసరాల ప్రాంతాలను పీడిస్తున్న అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌ను నేను సవాలు చేస్తున్నా’ అని అన్నారు.