చెన్నై: తమిళనాడులో (Tamil Nadu) భారతీయ జనతా పార్టీకి (BJP) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ ఐటీ వింగ్ చీఫ్ (IT Wing) సీటీఆర్ నిర్మల్ కుమార్ (Nirmal kumar)తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వెంటనే ఆయన బీజేపీ మిత్రపక్షమైన అన్నాడీఎంకే (AIADMK)లో చేరారు. నిర్మల్‌ను పార్టీ అధ్యక్షుడు పళనిస్వామి (Palaniswami) అన్నాడీఎంకేలోకి సాదరంగా ఆహ్వానించారు. కాగా, తన రాజీనామాకు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై (Annamalai) కారణమని, ఆయనపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ తన ట్విట్టర్ ఖాతాలో ఓ లేఖ పోస్టుచేశారు. అన్నామలైని ‘420 మలై’ అంటూ ఘాటుగా విమర్శించారు.
என்னால் முடிந்த வரை பல சங்கடங்களை கடந்து கடந்த 1.5 ஆண்டுகளாக பயணித்தேன்!
உண்மையாக நேர்மையாக உழைத்தேன், வேதனை மட்டுமே மிச்சம்!
விடைபெறுகிறேன் 🙏 pic.twitter.com/jcXAtJroid
— CTR.Nirmal kumar (@CTR_Nirmalkumar) March 5, 2023
ఏడాదిన్నరగా ఎన్నో ఇక్కట్లు ఎదురైనప్పటికీ ఎంతో నిజాయితీగా, కష్టపడి పని చేశానని నిర్మల్ ఆ లేఖలో పేర్కొన్నారు. అన్నామలై తన నిర్ణయాలను తప్పుబట్టేవారని, సొంత పార్టీ నేతలు, కార్యకర్తలపైనే నిఘా పెట్టారని ఆరోపించారు. తాను న్యాయ పోరాటం చేస్తున్న డీఎంకే మంత్రితో అన్నామలై సంప్రదింపులు జరుపుతున్నారని విమర్శించారు.
மாண்புமிகு கழக இடைக்காலப் பொது செயலாளர் திரு. @EPSTamilNadu அவர்களை, அவரது இல்லத்தில் இன்று, பாரதிய ஜனதா கட்சியின் தகவல் தொழில்நுட்பம் மற்றும் சமூக ஊடக பிரிவு மாநில தலைவர் திரு. @CTR_Nirmalkumar அவர்கள் நேரில் சந்தித்து தன்னை கழகத்தின் அடிப்படை உறுப்பினராக இணைத்துக் கொண்டார். pic.twitter.com/tH9G5v8xXD
— AIADMK (@AIADMKOfficial) March 5, 2023