న్యూఢిల్లీ: తమ ఆదేశాలను బేఖాతరు చేసి ఎన్నికల సంబరాలను జరుపుకుంటున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలను ఆదేశించింది కేంద్ర ఎన్నికల సంఘం. దేశంలో కొవిడ్ సంక్షోభం కారణంగా విజయోత్సవ ర్యాలీలు, సంబరాలపై ఈసీ నిషేధం విధించింది. అయినా కూడా ఈ ఆదేశాలను ఎవరూ పాటించడం లేదు. పశ్చిమ బెంగాల్, తమిళనాడులలో ఆయా పార్టీల కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఈసీ.. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
#WATCH TMC supporters celebrate at Kalighat, Kolkata as party leads on 202 seats as per official trends#WestBengalElections2021 pic.twitter.com/iiOyPhf8be
— ANI (@ANI) May 2, 2021
Respective State Chief Secretaries have been asked to take immediate action to stop such gatherings: Election Commission of India to ANI pic.twitter.com/eYeo1T1X6Z
— ANI (@ANI) May 2, 2021