 
                                                            భోపాల్: చేతిలోని కత్తితో అందరిని బెదిరించి మహిళను కిడ్నాప్ చేసేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. (Man Tries To Kidnap Woman) గతంలో అత్యాచారానికి పాల్పడిన ఆమె పెళ్లిని తన అనుచరులతో కలసి అడ్డుకున్నాడు. ఆ మహిళ కుటుంబ సభ్యులపై దాడి చేశాడు. అయితే జనం పెద్ద సంఖ్యలో గుమిగూడటంతో ఆ మహిళను వదిలి పారిపోయాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కాలు అలియాస్ సలీం ఖాన్ 22 ఏళ్ల యువతిపై గతంలో లైంగిక దాడికి పాల్పడ్డాడు. రికార్డ్ చేసిన వీడియోతో ఆ మహిళతోపాటు ఆమె కుటుంబం పరువుతీశాడు.
కాగా, గురువారం ఆ మహిళకు మరో వ్యక్తితో పెళ్లి జరుగుతున్నట్లు సలీం తెలుసుకున్నాడు. సాయంత్రం ఆరు గంటల సమయంలో అనుచరులు జోధా, సమీర్, షారుఖ్‌లతో కలిసి ఆమె ఇంటికి చేరుకున్నాడు. అతడి చేతిలో కత్తి ఉండగా అనుచరుల చేతుల్లో ఇనుప రాడ్లు ఉన్నాయి. ఆ మహిళ తండ్రి కాలు, సోదరుడి చేతిపై కొట్టి విరిచాడు. ఆమె తల్లిపై కూడా దాడి చేశాడు. పెనుగులాడుతున్న ఆ మహిళను ఇంటి నుంచి లాక్కెళ్లాడు. ఆమె కుటుంబ సభ్యులతోపాటు పెళ్లి చేసుకునే వ్యక్తిని, అతడి కుటుంబాన్ని హెచ్చరించాడు.
మరోవైపు ఇది చూసి స్థానికులు అక్కడ గుమిగూడారు. అయితే చేతిలోని కత్తిని చూపించి బెదిరించి ఆ మహిళను కిడ్నాప్ చేసేందుకు సలీం ప్రయత్నించాడు. స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడకు రావడంతో చివరకు ఆ మహిళను వదిలేసి పారిపోయాడు. అనంతరం హిందూ సంస్థ సభ్యుల జోక్యంతో ఆ మహిళ, ఆమె తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా కలకలం రేపిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
BJP rule Bhopal
#Bhopal | Sword In Hand, Man Tries To Kidnap Woman He Raped, From Her WeddingRead Here: https://t.co/hQsv15QdmE…#BJPHaraoDeshBachao #RejectBjp #DefeatBJP pic.twitter.com/EDVLVsgplS
— Anindya Das (@AnindyaDas1) May 31, 2024
 
                            