చండీగఢ్: పంజాబ్ శివసేన నేతను నిహాంగులు అడ్డుకున్నారు. కత్తులతో తల, చేతులపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిహాంగులు కత్తులతో దాడి చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Sword Attack On Shiv Sena Leader) లూథియానాకు చెందిన పంజాబ్ శివసేన నేత సందీప్ థాపర్, ఖలిస్థాన్‌కు వ్యతిరేకంగా మాట్లాడతారు. ఈ నేపథ్యంలో నిహాంగులు కత్తులతో ఆయనపై దాడి చేశారు. శుక్రవారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత స్కూటర్‌పై వెళ్తున్న సందీప్ థాపర్‌ను నిహాంగులు అడ్డుకున్నారు. ఆయనతో వాదనకు దిగారు. దీంతో సందీప్ థాపర్ గన్‌మేన్ అక్కడి నుంచి పారిపోయాడు.
కాగా, తనను విడిచిపెట్టాలంటూ చేతులు జోడించి సందీప్ థాపర్ ప్రాథేయపడ్డారు. అయినప్పటికీ నిహాంగులు కనికరించలేదు. ఆయన తల, చేతులపై కత్తులతో దాడి చేశారు. దీంతో థాపర్ స్కూటర్ నుంచి కింద పడిపడిపోయారు. అయినప్పటికీ నిహాంగులు ఆయనపై కత్తులతో దాడి కొనసాగించారు. ఆ తర్వాత స్కూటర్‌పై నిహాంగులు పారిపోయారు.
మరోవైపు తీవ్రంగా గాయపడిన శివసేన నేత సందీప్ థాపర్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. లూథియానా పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సరబ్జిత్ సింగ్, హర్జోత్ సింగ్ అనే ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. మూడో వ్యక్తి తెహల్ సింగ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
కాగా, పంజాబ్ శివసేన నేత సందీప్ థాపర్‌పై నిహాంగులు కత్తులతో క్రూరంగా దాడి చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. శాంతిభద్రతలను కాపాడటంలో పంజాబ్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించాయి.
Life-threatening attack on ‘Shivsena Punjab’ leader Sandeep Thapar in Ludhiana : Condition critical
The escort Police officer stood by as a mute spectator
4 individuals dressed as Nihang Sikhs attacked Thapar with swords in broad daylight
Possibility of attack due to Thapar’s… pic.twitter.com/0wblsbtRzV
— Sanatan Prabhat (@SanatanPrabhat) July 5, 2024