Suvendu Adhikari | సువేందు అధికారి పీఏ హత్య కేసు.. యూపీలో షూటర్‌ను అరెస్టు చేసిన సీబీఐ
Suvendu Adhikari : పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి పీఏ చంద్రనాథ్ రాథ్ హత్య కేసు విచారణను సీబీఐ వేగవంతం చేసింది. చంద్రనాథ్‌ను కాల్చి చంపిన షూటర్ రాజ్‌కుమార్‌ను సీబీఐ సోమవారం అరెస్టు చేసింది.
Suvendu Adhikari : పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి పీఏ చంద్రనాథ్ రాథ్ హత్య కేసు విచారణను సీబీఐ వేగవంతం చేసింది. చంద్రనాథ్‌ను కాల్చి చంపిన షూటర్ రాజ్‌కుమార్‌ను సీబీఐ సోమవారం అరెస్టు చేసింది. యూపీ పోలీసుల సహకారంతో అతడిని ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్ నగర్లో సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం అతడి ట్రాన్సిట్ రిమాండ్‌ను సీబీఐ అధికారులు తీసుకుని, కోల్‌కతా తరలిస్తున్నారు. మంగళవారం రాజ్ కుమార్‌ను సీబీఐ కోర్టులో ప్రవేశపెట్టాలని అధికారులు నిర్ణయించారు. చంద్రనాథ్.. సువేందు అధికారికి అత్యంత సన్నిహితుడు. అతడిని, ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండు రోజులకు.. అంటే ఈ నెల 6న దుండగులు నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని దోల్తాలాలో అత్యంత సమీపం నుంచి కాల్చి చంపారు. దీంతో ఈ హత్యకేసును విచారించేందుకు అధికారులు సిట్ ఏర్పాటు చేశారు.
ఈ ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రనాథ్ కుటుంబానికి సువేందు అధికారి హామీ ఇచ్చారు. దీనిలో భాగంగా సిట్ నుంచి కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ సువేందు అధికారి నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటనలో ఇప్పటికే మయాంక్ రాజ్ మిశ్రా, విక్కీ మౌర్యా, రాజ్ సింగ్ అనే ముగ్గురు నిందితుల్ని సీబీఐ అరెస్టు చేసింది. మరోవైపు ఈ హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

