జైపూర్: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) సిబ్బంది ఒక ఎస్‌యూవీలో రైల్వే క్రాసింగ్ వద్ద రైలు పట్టాలు దాటేందుకు ప్రయత్నించారు. ఆ వాహనం రైలు పట్టాల వద్ద చిక్కుకున్నది. ఇంతలో అటుగా వచ్చిన రైలు ఆ ఎస్‌యూవీని ఢీకొట్టింది. (Train Hits SUV) అయితే అందులో ఉన్న ముగ్గురు సీఐఎస్ఎఫ్ సిబ్బంది క్షణాల్లో ఆ వాహనం నుంచి బయటపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రాజస్థాన్‌లోని గంగానగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మార్చి 21న సూరత్‌గఢ్ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్‌లో విధులు నిర్వహించే సీఐఎస్ఎఫ్కు చెందిన ముగ్గురు సిబ్బంది పెట్రోలింగ్ కోసం ఎస్‌యూవీలో బయలుదేరారు.
కాగా, రైల్వే క్రాసింగ్ వద్ద మలుపు తిరిగిన ఆ వాహనం రైలు పట్టాల వద్దకు చేరుకున్నది. అక్కడ అది చిక్కుకుపోయింది. ఇంతలో అటుగా వచ్చిన రైలు ఆ ఎస్‌యూవీని ఢీకొట్టి కొంతదూరం ఈడ్చుకెళ్లింది.
మరోవైపు ముందుగానే అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఆ వాహనం నుంచి దూకేశారు. దీంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#Rajasthan: An SUV of a central police force was rammed by a train at a level crossing near #Suratgarh Super Thermal Power Plant in Rajasthan.
CCTV footage of the accident has gone viral on social media. pic.twitter.com/WxbVvFoQUl
— Siraj Noorani (@sirajnoorani) March 22, 2025