లక్నో, సెప్టెంబర్ 1: ఐపీఎస్ అధికారి కుమార్తె, లా విద్యార్థిని ఒకరు హాస్టల్ రూమ్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన యూపీలోని లక్నోలో చోటుచేసుకుంది. ఎన్ఐఏలో ఐజీగా ఉన్న సంతోష్ రస్తోగి కుమార్తె అనికా రస్తోగి (19) లక్నోలోని రామ్ మనోహర్ లోహియా నేషనల్ లా యూనివర్సిటీలో లా మూడో సంవత్సరం చదువుతున్నది.
శనివారం రాత్రి ఆమె హాస్టల్ రూమ్‌లోని నేలపై అచేతనంగా పడి ఉండటంతో దవాఖానకు తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్టు డాక్టర్లు ప్రకటించారు. ఆమె మృతికి కారణాలు తెలియరాలేదని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆషియానా పోలీసులు తెలిపారు.