న్యూఢిల్లీ: కాలేయ చికిత్సలో వాడే డిఫిటిలియో, క్యాన్సర్ నివారణ కోసం వాడే యాడ్సిట్రిస్(ఇంజెక్షన్)లను పోలిన నకిలీ ఔషధాల పంపిణీ, అమ్మకాలను అడ్డుకోవాలని, కఠిన నిఘా పెట్టాలని భారత ఔషధ నియంత్రణ మండలి(డీసీజీఐ) రాష్ర్టాలు, యూటీలను ఆదేశించింది. భారత్ సహా నాలుగు దేశాల్లో టకేడా ఫార్మా సంస్థ తయారుచేసిన యాడ్సిట్రిస్(50 ఎంజీ) పోలిన నకిలీ ఇంజెక్షన్ల అమ్మకాలు జోరుగా ఉన్నాయని డబ్ల్యూహెచ్వో ఇటీవల హెచ్చరించింది. ‘నకిలీ మందుల వినియోగంతో వ్యాధి నివారణ జరగదు. అంతేగాక పేషెంట్ ఆరోగ్య పరిస్థితిపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది. కొన్ని కేసుల్లో రోగి చనిపోయే ప్రమాదం కూడా ఉంది’ అని డబ్ల్యూహెచ్వో అభిప్రాయపడింది.