చండీగఢ్: ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు ఒక రోగికి సర్జరీ చేస్తున్నారు. అయితే విద్యుత్ కోత కారణంగా ఆపరేషన్ థియేటర్లోని ఎమర్జెన్సీ లైట్లు ఆగిపోయాయి. దీంతో ఆ రోగికి శస్త్రచికిత్సను డాక్టర్లు నిలిపివేశారు. (Surgery Halted Amid Power Cut) కరెంట్ తిరిగి వచ్చే వరకు వైద్యులు వేచి ఉన్నారు. దీని గురించి ఒక డాక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పంజాబ్లోని పాటియాలాలో ఈ సంఘటన జరిగింది. ఇటీవల ప్రభుత్వ రాజీంద్ర ఆసుపత్రికి చెందిన వైద్యుల బృందం ఆపరేషన్ థియేటర్లో ఒక రోగికి ఆపరేషన్ చేశారు. అయితే ఉన్నట్టుండి కరెంట్ పోయింది. దీంతో ఆపరేషన్ థియేటర్లోని ఎమర్జెన్సీ లైట్లు ఆగిపోయాయి. విద్యుత్ పరికరాలు కూడా పనిచేయలేదు. ఈ నేపథ్యంలో డాక్టర్లు ఆ రోగికి ఆపరేషన్ నిలిపివేశారు. కరెంట్ రాకకోసం ఎదురుచూశారు.
కాగా, ఆ రోగికి ఆపరేషన్ చేస్తున్న బృందంలోని ఒక వైద్యుడు ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న ఈ దుస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితిలో ఆ రోగికి ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహించాలని ప్రశ్నించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పంజాబ్లోని ఆప్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి.
మరోవైపు పంజాబ్ ఆరోగ్య మంత్రి బల్బీర్ సింగ్ ఈ సంఘటనపై స్పందించారు. ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ బ్యాకప్ వ్యవస్థలు సక్రమంగా పని చేస్తున్నాయని తెలిపారు. విద్యుత్ పునరుద్ధరణ వెంటనే జరిగిందని చెప్పారు. అయితే ఆ డాక్టర్ భయపడి ఈ వీడియోను రికార్డ్ చేసినట్లు ఆయన ఆరోపించారు. ఆ రోగికి సర్జరీలో ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదని అన్నారు. ఆసుపత్రి సిబ్బంది ఎల్లప్పుడూ రోగి సంరక్షణపై దృష్టిసారించాలని మంత్రి బల్బీర్ సింగ్ సూచించారు.
Pathetic state of affairs in Patiala Govt Rajindra Hospital where doctors make a video clip to highlight their plight due to power failure and no back up.
Mid-operation power failure results in equipment shut down and danger to patient’s life.
pic.twitter.com/qUH8pLHJ7r— Man Aman Singh Chhina (@manaman_chhina) January 24, 2025