Kuwait Fire Accident : కువైట్లో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన 45 మంది భారతీయుల భౌతిక కాయాలు శుక్రవారం ఉదయం ఐఏఎఫ్ విమానంలో కేరళలోని కొచ్చికి తరలించారు. బాధితుల మృతదేహాలను చూసి కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. మృతుల భౌతికకాయాలకు కేరళ సీఎం (Kerala CM) పినరయి విజయన్ (Pinarayi Vijayan) నివాళులర్పించారు.ఉదయం విమానాశ్రయానికి చేరుకున్న సీఎం.. అక్కడ మృతదేహాల వద్ద పుష్ప గుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. అనంతరం మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓదార్చారు.
సీఎంతోపాటు కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్, ఇతర అధికారులు కూడా నివాళులర్పించారు.ఇక కొచ్చి విమానాశ్రయంలో బాధితుల మృతదేహాలను సందర్శించిన కేంద్ర మంత్రి సురేష్ గోపీ ఇతర నేతలు నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
కాగా, కువైట్లోని మంగఫ్ సిటీలో బుధవారం ఉదయం 6 గంటలకు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎన్బీటీసీకి చెందిన 6 అంతస్తుల భవనంలో చెలరేగిన మంటల్లో అక్కడికక్కడే 49 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 45 మంది భారతీయ వలస కార్మికులు ఉన్నారు. వంట గదిలో ప్రమాదం జరిగిందని, అనంతరం మంటలు వ్యాపించాయని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో ఇరుక్కుపోయి అక్కడ వెలువడిన పొగ పీల్చడం వల్ల పలువురు కార్మికులు చనిపోయినట్టు తెలుస్తున్నది.
Read More :
Niranjan Reddy | రుణమాఫీపై కాంగ్రెస్ సర్కార్ ఆంక్షలు గర్హనీయం: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి