School Teacher | ఓ ఉపాధ్యాయురాలు (School Teacher ) ఆరేళ్ల చిన్నారి పట్ల దారుణంగా ప్రవర్తించింది. క్లాస్‌లో సరిగా రాయట్లేదన్న కారణంతో చావబాదింది. ఈ ఘటన సూరత్ (Surat)లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
సూరత్‌లోని సాధన నికేతన్ స్కూల్ (Sadhna Niketan School)లో యూకేజీ చదువుతున్న ఆరేళ్ల చిన్నారిని యశోద అనే టీచర్ విచక్షణా రహితంగా కొట్టింది. చిన్నారి పక్కన కుర్చీ వేసుకుని కూర్చున్న ఆమె.. విద్యార్థిని సరిగా రాయకపోవడంతో ఆగ్రహానికి గురైంది. ఈ క్రమంలో చిన్నారి వీపుపై పదేపదే చేత్తో గట్టిగట్టిగా కొట్ట సాగింది. చిన్నారి చెక్కులను గిల్లుతూ చితకబాదింది. మొత్తం 35 సార్లకు పైగా ఆ చిన్నారిని దారుణంగా కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై స్పందించిన జిల్లా విద్యా శాఖ అధికారులు సదరు ఉపాధ్యాయురాలిపై చర్యలకు ఉపక్రమించారు. టీచర్‌ను విధుల నుంచి తొలగించి ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.
35 ઝાપટ એ પણ 3 વર્ષની બાળકીને! આ શિક્ષક છે કે રાક્ષસ?
(સુરતના કાપોદ્રાની સાધના નિકેતન સ્કૂલમાં સાડા 3 વર્ષની બાળકીને એક શિક્ષિકાએ 35 લાફા ઝીંકી દેતા મામલો વધારે ઉગ્ર બન્યો છે. )#Teacher #School #Surat #SandhnaNiketanSchool #VTVGujarati pic.twitter.com/jFysUCw9iG
— ~ अभिमन्यु ~ ( VTV NEWS ) (@soulofnovemberr) October 11, 2023
Also Read..
Cab Driver | క్యాబ్ డ్రైవర్‌పై దాడి.. కారుతో ఢీ కొట్టి 200 మీటర్లు ఈడ్చుకెళ్లిన దుండగులు
Samantha | చై-సామ్ మళ్లీ కలవబోతున్నారంటూ ప్రచారం.. హింట్ ఇచ్చిన సమంత
Divya Prabha | విమానంలో మలయాళ నటికి వేధింపులు.. మెయిల్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు