Divya Prabha | విమానంలో మలయాళ నటికి వేధింపులు.. మెయిల్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు
Divya Prabha | ప్రముఖ మలయాళ నటి (Malayalam actress) దివ్య ప్రభ (Divya Prabha)కు చేదు అనుభవం ఎదురైంది. విమానంలో ఆమె లైంగిక వేధింపులకు (harassment ) గురైంది.
Divya Prabha | ప్రముఖ మలయాళ నటి (Malayalam actress) దివ్య ప్రభ (Divya Prabha)కు చేదు అనుభవం ఎదురైంది. విమానంలో ఆమె లైంగిక వేధింపులకు (harassment ) గురైంది. దివ్య.. మంగళవారం ముంబై నుంచి కొచ్చి (Mumbai-Kochi)కి ఎయిర్ ఇండియా (Air India) AI 681 విమానంలో ప్రయాణించింది. ఆ సమయంలో పక్క సీటులో ఉన్న వ్యక్తి తనను వేధింపులకు గురి చేసినట్లు నటి వెల్లడించింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.
‘మద్యం మత్తులో ఓ వ్యక్తి 12సీ సీటులో కూర్చున్నాడు. తర్వాత తన సీటును 12బీకి మార్చుకుని, నా పక్క సీటు (12ఏ)లోకి చేరాడు. విండో సీటు కోసం నాతో వాగ్వాదానికి దిగాడు. నన్ను భౌతికంగా తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. నేను ఈ విషయాన్ని వెంటనే ఎయిర్ హోస్టెస్‌కు దృష్టికి తీసుకెళ్లాను. దీంతో వారు విమానం టేకాఫ్‌కు కొద్ది సేపటికి ముందు నా సీటును మార్చారు. కానీ, అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత ఈ విషయాన్ని విమానాశ్రయ సిబ్బంది, ఎయిర్ ఇండియా ఆఫీస్ సిబ్బందికి చెప్పాను. దాంతో పోలీసుల సాయం పొందాలని వారు నాకు సూచించారు. దీంతో నేను ఈ విషయంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయవలసిందిగా కేరళ పోలీసులకు ఈ మెయిల్ ద్వారా అధికారికంగా ఫిర్యాదు చేశాను’ అని నటి వివరించింది.
Also Read..
Mobile Phones Stolen | మ్యూజిక్ ఫెస్ట్‌లో డజన్ల కొద్దీ మొబైల్ ఫోన్స్ చోరీ..!
Vladimir Putin | ఇజ్రాయెల్-హమాస్ హింసాకాండ.. అమెరికా పాలసీ వైఫల్యమే కారణమన్న పుతిన్
Israel-Hamas War | హమాస్‌పై పైచేయి.. గాజా సరిహద్దు ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

