Israel-Hamas War | హమాస్‌పై పైచేయి.. గాజా సరిహద్దు ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్
Israel-Hamas War | ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం (Israel-Hamas War) ఐదో రోజుకు చేరుకుంది. అక్టోబర్ 6న ప్రారంభమైన ఈ యుద్ధంలో హమాస్‌పై (Hamas) ఇజ్రాయెల్ క్రమంగా పైచేయి సాధిస్తోంది. వారి ఆధీనంలో ఉన్న ప్రాంతాలను తిరిగి తమ ఆధీనంలోకి తీసుకుంటోంది.
Israel-Hamas War | ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం (Israel-Hamas War) ఐదో రోజుకు చేరుకుంది. అక్టోబర్ 6న ప్రారంభమైన ఈ యుద్ధంలో హమాస్‌పై (Hamas) ఇజ్రాయెల్ క్రమంగా పైచేయి సాధిస్తోంది. వారి ఆధీనంలో ఉన్న ప్రాంతాలను తిరిగి తమ ఆధీనంలోకి తీసుకుంటోంది. తాజాగా గాజా (Gaza) సరిహద్దులోని దక్షిణ ఇజ్రాయెల్‌ను హమాస్ ఉగ్రవాదుల నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్నట్టు ఇజ్రాయెల్ రక్షణ శాఖ (The Israeli Defence Force) తాజాగా ప్రకటించింది. అంతే కాకుండా ఆ ప్రాంతంలోని అనేక ప్రదేశాలు, రహదారులను కూడా తమ నియంత్రణలోకి తెచ్చుకున్నట్లు సైన్యం (Israel Army) వెల్లడించింది.
ఇజ్రాయెల్‌పై పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ గత శనివారం మెరుపు దాడికి దిగిన విషయం తెలిసిందే. దీంతో ఇజ్రాయెల్ సైతం హమాస్‌పై యుద్ధం ప్రకటించింది. దీంతో దాడులు, ప్రతి దాడులతో రెండు దేశాల భూభాగాలు దద్దరిల్లుతున్నాయి. ఇరు దేశాల్లో వీధులు రక్తంతో తడిసిపోయాయి. గత ఐదు రోజుల్లో దాదాపు 3,500 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎక్కడ చూసిన గుట్టలు గుట్టలుగా పడి ఉన్న మృతదేహాలతో రెండు ప్రాంతాలు భయానకంగా మారిపోయాయి. క్షతగాత్రుల రోదనలతో యుద్ధ ప్రాంతాలు హృదయవిదారకంగా దర్శనమిస్తున్నాయి. అయినా ఇజ్రాయెల్, హమాస్ వెనక్కి తగ్గడం లేదు. హమాస్ దాడులను ఇజ్రాయెల్ ధీటుగా ఎదుర్కొంటోంది. ఈ మేరకు వైమానిక దాడులను కొనసాగిస్తోంది. మరోవైపు హమాస్ మిలిటెంట్ల ఆధీనంలో ఉన్న గాజాపై దాడులను ఉధృతం చేయడానికి సిద్ధమవుతోంది. ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ ఇజ్రాయెల్‌లో తన సభ్యులను సమీకరిస్తోంది. భారీ సైనిక సామగ్రితో పాటు రిజర్వ్ దళాలకు చెందిన మరింత మందిని రంగంలోకి దింపుతోంది.
తమ భూభాగంలోకి చొరబడిన హమాస్ బలగాలను ఇజ్రాయెల్ సైన్యం మట్టుపెట్టే పనిలో పడింది. ఇప్పటి వరకు దాదాపు 1,500 మంది హమాస్ మిలిటెంట్లను హతమార్చినట్టు ఇజ్రాయెల్ మంగళవారం వెల్లడించింది. తమ భూభాగంలోని వివిధ ప్రాంతాల్లో వారి మృతదేహాలను గుర్తించామని పేర్కొంది. సరిహద్దుల్లోని తమ భూభాగాన్ని తిరిగి నియంత్రణలోకి తీసుకొన్నామని తెలిపింది. మరోవైపు, గాజా వైపు నుంచి సరిహద్దులవైపు ఎవరొచ్చినా కాల్చివేయాలని తమ బలగాలకు ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
పసిపిల్లలపై హమాస్ అమానుషం
ఇజ్రాయెల్‌లో హమాస్ మిలిటెంట్లు నర మేధం సృష్టిస్తున్నారు. పసిపిల్లలపై కూడా వారు కనికరం చూపించడం లేదు. కెఫర్ అజా కిబుట్జ్‌లో 40 మంది చిన్నారుల మృతదేహాలను గుర్తించినట్టు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు.వాటిలో కొన్నింటికి తలలు లేవని పేర్కొన్నారు. కాగా హమాస్ దాడుల వెనుక తమ ప్రమేయం లేదని ఇరాన్ తెలిపింది. ఈ మేరకు ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ వెల్లడించారు.
Also Read..
Israel-Hamas war | ఇజ్రాయెల్‌లో 40 మంది పసిబిడ్డలను హత్యచేసిన హమాస్
Mobile Phones Stolen | మ్యూజిక్ ఫెస్ట్‌లో డజన్ల కొద్దీ మొబైల్ ఫోన్స్ చోరీ..!
Nanded hospital | 8 రోజుల్లో 108 మరణాలు.. నాందేడ్ ఆసుపత్రిలో కొనసాగుతున్న మరణమృదంగం
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

