Vladimir Putin | ఇజ్రాయెల్-హమాస్ హింసాకాండ.. అమెరికా పాలసీ వైఫల్యమే కారణమన్న పుతిన్
Vladimir Putin | పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధంపై (Israel-Hamas War) రష్యా అధ్యక్షుడు (Russian President ) వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) తాజాగా స్పందించారు. రెండు దేశాల మధ్య నెలకొన్న హింసాకాండకు అమెరికా మిడిల్ ఈస్ట్ (Middle East) వైఫల్యమే కారణమని ఆరోపించారు.
Vladimir Putin | పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధంపై (Israel-Hamas War) రష్యా అధ్యక్షుడు (Russian President ) వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) తాజాగా స్పందించారు. రెండు దేశాల మధ్య నెలకొన్న హింసాకాండకు అమెరికా మిడిల్ ఈస్ట్ (Middle East) వైఫల్యమే కారణమని ఆరోపించారు. ఇజ్రాయెల్-పాలస్తీనాల మధ్య హింస చెలరేగడానికి అమెరికా పాలసీ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. అదేవిధంగా పాలస్తీనియన్ల ప్రయోజనాలను యునైటెడ్ స్టేట్స్ విస్మరించిందని విమర్శించారు. ఇక ఇదే సందర్భంలో ఇజ్రాయెల్-పాలస్తీనా అంశంపై కూడా పుతిన్ మాట్లాడారు. ‘స్వతంత్ర సార్వభౌమ’ పాలస్తీనా రాజ్యాన్ని ఏర్పాటు చేయాల్సిన ‘అవసరం’ ఉందని అభిప్రాయపడ్డారు.
‘మిడిల్ ఈస్ట్‌లో అమెరికా పాలసీ వైఫల్యానికి ఇది స్పష్టమైన ఉదాహరణ. చాలా మంది ప్రజలు నా అభిప్రాయంతో ఏకభవిస్తారని నేను భావిస్తున్నాను. ఈ ప్రాంతంలో శాంతి నెలకొల్పడానికి అంతర్జాతీయ ప్రయత్నాలకు ఆధిపత్యం వహించేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. ఇరువైపులా ఆమోదయోగ్యమైన రాజీ కుదర్చడంలో వాషింగ్టన్ పూర్తిగా విఫలమైంది’ అని పుతిన్ ఆరోపించారు. ఇక రష్యా ఇరు దేశాలతో (ఇజ్రాయెల్, హమాస్) టచ్‌లో ఉందని, సమస్యను పరిష్కరించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని తెలిపారు.
ఇజ్రాయెల్‌పై పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ గత శనివారం మెరుపు దాడికి దిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇజ్రాయెల్ సైతం హమాస్‌పై యుద్ధం ప్రకటించింది. దీంతో దాడులు, ప్రతి దాడులతో రెండు దేశాల భూభాగాలు దద్దరిల్లుతున్నాయి. ఇరు దేశాల్లో వీధులు రక్తంతో తడిసిపోయాయి. గత ఐదు రోజుల్లో దాదాపు 3,500 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎక్కడ చూసిన గుట్టలు గుట్టలుగా పడి ఉన్న మృతదేహాలతో రెండు ప్రాంతాలు భయానకంగా మారిపోయాయి. క్షతగాత్రుల రోదనలతో యుద్ధ ప్రాంతాలు హృదయవిదారకంగా దర్శనమిస్తున్నాయి.
Also Read..
Israel-Hamas War | హమాస్‌పై పైచేయి.. గాజా సరిహద్దు ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్
Mobile Phones Stolen | మ్యూజిక్ ఫెస్ట్‌లో డజన్ల కొద్దీ మొబైల్ ఫోన్స్ చోరీ..!
Israel-Hamas War | తీవ్రరూపం దాల్చిన ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. 3 వేలు దాటిన మృతులు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

