అహ్మదాబాద్: తన భార్య అదృశ్యమైనట్లు ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొన్ని రోజుల తర్వాత అతడు కూడా కనిపించలేదు. ఇంట్లో ఒక లేఖను గమనించిన కుమారుడు పోలీసులకు దానిని అందజేశాడు. దీంతో భార్యను అతడు హత్య చేసినట్లు ఆ లేఖ ద్వారా బయటపడింది. (man kills dietitian wife) గుజరాత్‌లోని సూరత్‌లో ఈ సంఘటన జరిగింది. 40 ఏళ్ల విశాల్ సాల్వికి 39 ఏళ్ల శిల్పాతో 2010లో వివాహమైంది. 13, 8 ఏళ్ల వయస్సున్న ఇద్దరు కుమారులు వారికి ఉన్నారు. డైమండ్ పాలిష్ ఫ్యాక్టరీలో పని చేసిన విశాల్ కొంతకాలంగా ఖాళీగా ఉంటున్నాడు. అతడి భార్య శిల్పా డైటీషియన్‌గా పని చేస్తున్నది.
కాగా, తన భార్య అదృశ్యమైదంటూ స్థానిక పోలీస్ స్టేషన్లో విశాల్ ఫిర్యాదు చేశాడు. రెండు రోజుల తర్వాత అతడు కూడా మాయమయ్యాడు. అతడి చిన్న కుమారుడు ఇంట్లో ఒక లేఖను గుర్తించాడు. దానిని పోలీసులకు అప్పగించాడు. ఏప్రిల్ 20న సలాబత్పురలోని పూర్వీకుల ఇంటిలో భార్యను హత్య చేసి ఒక పెట్టెలో ఉంచి సిమెంట్‌తో కప్పి పాతినట్లు ఆ లేఖలో విశాల్ రాశాడు. భార్యలో మార్పు రావడంతో ఆమెపై అనుమానించి ఈ హత్య చేసినట్లు అందులో పేర్కొన్నాడు.
మరోవైపు పోలీసులు ఆ ఇంటికి వెళ్లారు. ఖాళీగా ఉన్న ఆ పాత ఇంట్లో పాతిన చెక్కపెట్టెను తెరిచారు. సిమెంట్‌తో కప్పిన శిల్పా మృతదేహం బయటపడింది. దీంతో పోస్ట్‌మార్టం కోసం తరలించారు. శిల్పా తండ్రి ఫిర్యాదుపై హత్య కేసు నమోదు చేశారు. చివరకు ఒక చోట ఉన్న విశాల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read:
teachers die of heatstroke | జనగణన విధుల్లో ఉన్న ఇద్దరు టీచర్లు.. వడదెబ్బతో మృతి
Man Kills Old Man | బస్సు రూట్ చెప్పనందుకు.. వృద్ధుడ్ని చంపిన యువకుడు
Watch: ట్రంప్‌కు ‘మిడిల్ ఫింగర్’ చూపించిన కర్ణాటక మంత్రి.. ఎందుకంటే?