TG DGP | పోలీసులకు తీపికబురు.. పుట్టినరోజు, వివాహ వార్సికోత్సవం సెలవులు మంజూరు..!
TG DGP : తెలంగాణ పోలీసులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. నిత్యం విధి నిర్వహణలో ఒత్తిడికి లోనయ్యే పోలీసు సిబ్బందికి ఇకపై పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవం వంటి రోజుల్లో సెలవులు మంజూరు చేసింది.
TG DGP : తెలంగాణ పోలీసులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. నిత్యం విధి నిర్వహణలో ఒత్తిడికి లోనయ్యే పోలీసు సిబ్బందికి ఇకపై పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవం వంటి రోజుల్లో సెలవులు మంజూరు చేసింది. సోమవారం డీజీపీ శివధర్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు. నిరంతరం క్షేత్రస్థాయిలో విధుల్లో తలమునకలయ్యే పోలీసులు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి ఉపశమనం, మనోధైర్యం పెంపొందించే దిశగా డీజీపీ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలోని పోలీసులకు డీజీపీ శివధర్ రెడ్డి శుభవార్త చెప్పారు. ఇకపై ప్రతి పోలీసు అధికారి, సిబ్బందికి తమ పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవం రోజున కుటుంబ సభ్యులతో గడిపేందుకు వీలుగా సెలవులను ప్రకటించారు. కఠినమైన విధులు నిర్వహిస్తూ, సమాజ రక్షణ కోసం తమ వ్యక్తిగత జీవితాన్ని, సంతోషాన్ని త్యాగం చేస్తున్న పోలీసులు శ్రేయస్సు కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. సిబ్బందిలో పని- వ్యక్తిగత జీవితం సమతుల్యతను పెంపొందించడంతో పాటు, వృత్తి పట్ల వారి అంకితభావానికి గుర్తుగా ఈ గౌరవం కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో డీజీపీ పేర్కొన్నారు.
Telangana police will now be ‘granted leave without fail’ for #birthdays and #anniversaries for the department employees. pic.twitter.com/zGXKOoz2pY
— NewsMeter (@NewsMeter_In) April 27, 2026
కానిస్టేబుల్ స్థాయి నుండి ఉన్నతాథికారుల వరకూ అందరికీ ఈ వెసులుబాటు వర్తిస్తుందని, అయితే.. ఈ సెలవులు పొందాలంటే ఒక షరతు ఉంది. సర్వీస్ రిజిష్టర్ ఆధారంగా తమ పుట్టిన రోజు, వివాహ వార్షికోత్సవానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలతో ముందుగానే రాత పూర్వకంగా అభ్యర్థన సమర్పించాలి. శాంతి భద్రతల దృష్ట్యా ఏవైనా అత్యవసర పరిస్థితులు తలెత్తితే తప్పించి.. సాధారణ సమయాల్లో సంబంధిత యూనిట్ అధికారులు సిబబ్ది విజ్ఞప్తిని కాదనకుండా సెలవులు మంజూరు చేయాలని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

