DC vs RCB | నిప్పులు చెరుగుతున్న భువనేశ్వర్, హేజిల్‌వుడ్.. 8 పరుగులకే ఆరు వికెట్లు..!
DC vs RCB : ఆర్సీబీ సీనియర్ పేసర్లు భువనేశ్వర్(3-5), హేజిల్‌వుడ్(3-6) ఢిల్లీ గడ్డపై నిప్పులు చెరుగుతున్నారు. బెంగళూరు పేసర్ల విజృంభణ చూస్తుంటే ఐపీఎల్ చరిత్రలో అత్యల్ప స్కోర్‌ను ఢిల్లీ బ్రేక్ చేసేలా ఉంది.
DC vs RCB : ఆర్సీబీ సీనియర్ పేసర్లు భువనేశ్వర్(3-5), హేజిల్‌వుడ్(3-6) ఢిల్లీ గడ్డపై నిప్పులు చెరుగుతున్నారు. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లను బెంబేలెత్తిస్తూ రెండు ఓవర్లలో మూడు వికెట్లతో బెంగళూరుకు అదిరిపోయే బ్రేకిచ్చాడీ వెటరన్. ఇన్నింగ్స్ తొలి ఓవర్లో మొదటి బంతికే అరంగేట్రం కుర్రాడు సహిల్ పరాఖ్(0)కు భువనేశ్వర్ యార్కర్‌తో బౌల్డ్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్లో ట్రిస్టన్ స్టబ్స్(5), అక్షర్ పటేల్(0)ను ఔట్ చేయడంతో 7 పరుగులకే ఢిల్లీ ఐదు కీలక వికెట్లు కోల్పోయింది.
సొంత మైదానంలో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఆర్సీబీ పేసర్లు వణికిస్తున్నారు. భువనేశ్వర్ తొలి బంతికే ఓపెనర్ సహిల్ పరాఖ్(0)ను బౌల్డ్ చేయగా.. ఆ తర్వాతి హేజిల్‌వుడ్ మొదటి రెండు బంతుల్లో కేఎల్ రాహుల్(1), సమీర్ రిజ్వీ(0)లను ఔట్ చేసి హ్యాట్రిక్‌పై నిలిచాడు. ట్రిస్టన్ స్టబ్స్(5) వికెట్ కాపాడుకున్నా భువనేశ్వర్‌కు దొరికిపోయాడు.
Josh Hazlewood being so 𝙂𝙤𝙤𝙙 👌
🎥 The #RCB seamer starts his spell sending back KL Rahul and Sameer Rizvi 😮
Updates ▶️ https://t.co/HIiNNEutP0#TATAIPL | #KhelBindaas | #DCvRCB | @RCBTweets pic.twitter.com/OSMRlv07PX
— IndianPremierLeague (@IPL) April 27, 2026
ఆ షాక్ నుంచి తేరుకునేలోపే అక్షర్ పటేల్(0)ను భువి ఔట్ చేసి ఢిల్లీని భయపెట్టాడు. నేనేమన్నా తక్కువా అన్నట్టు ఆ తర్వాతి ఓవర్లోనే నితీశ్ రానా(1)ను హేజిల్‌వుడ్ వెనక్కి పంపాడు. అంతే.. 8 పరుగులకేఆరో వికెట్ పడింది. బెంగళూరు పేసర్ల విజృంభణ చూస్తుంటే ఐపీఎల్ చరిత్రలో అత్యల్ప స్కోర్‌ను ఢిల్లీ బ్రేక్ చేసేలా ఉంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్న విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్!
Power cuts | మెదక్ జిల్లాలో కనీసం ఆరు గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదు : పద్మాదేవేందర్ రెడ్డ
Congress rule | కాంగ్రెస్ పాలనలో మళ్లీ అయిల్ ఇంజన్లు..! కన్నీళ్లతో సాగు చేస్తున్న రైతన్నలు
Smit Machchhar: పైలట్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ ప్రెసిడెన్షియల్ అవార్డు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

