Supreme court: పంట వ్యర్థాల కాల్చివేతపై నిషేధం కోరుతూ దాఖలైన పిటిషన్ అత్యవసర విచారణను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
పంటవ్యర్థాల కాల్చివేతపై నిషేధం విధించాలనే పిటిషన్ అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో చెప్పింది
ఢిల్లీలోకాలుష్యంని తగ్గించడానికి పంట వ్యర్థాల కాల్చివేతపై నిషేధం విధించాలని, కొత్తగా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ని అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్.డి.వై.చంద్రచూడ్, జస్టిస్ హిమ కోహ్లీ, జస్టిస్.జేబీ.పర్దివాల్తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. శశాంక్ శేఖర్ ఝా అనే న్యాయవాది ఈ పిటిషన్ వేశాడు. ‘పంట వ్యర్థాల కాల్చివేతపై నిషేధం విధించనంత మాత్రాన ఢిల్లీలో కాలుష్యం తగ్గిపోతుందా?’ అని పిల్ దాఖలు చేసిన శశాంక్ శేఖర్ ఝాని ధర్మాసనం ప్రశ్నించింది. ఢిల్లీ కాలుష్యానికి మీరు చెప్పే పరిష్కారం ఏంటి? అని శశాంక్ని జస్టిస్.డి.వై. చంద్రచూడ్ అడిగారు.
‘పంట వ్యర్థాలపై మేము నిషేధం విధించామే అనుకోండి? దాంతో ఢిల్లీలో కాలుష్యం తగ్గుతుందా? పంట వ్యర్థాల్ని కాల్చకుండా ప్రతి రైతును అడ్డుకోగలమా? ఈ సమస్యకు సహేతుకమైన పరిష్కారలు ఆలోచించాలి. కొన్ని విషయాల్లో కోర్టులు కొంతవరకే పనిచేస్తాయి. అలానే కొన్నింటిని కోర్టు ఆదేశాల ద్వారా మార్చలేం’ అని పిల్ విచారణను తోసిపుచ్చుతూ ప్రధాన న్యాయమూర్తి అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

