న్యూఢిల్లీ: తొలిసారి సుప్రీంకోర్టు శీతాకాలం సెలవుల్లో ప్రత్యేక వెకేషన్ బెంచీలను నిర్వహించి చరిత్ర సృష్టించింది. డిసెంబర్ 22, డిసెంబర్ 29న సీజేఐ సూర్యకాంత్ ఈ ప్రత్యేక బెంచీలకు సారథ్యం వహించడం విశేషం.
శీతాకాలం సెలవుల్లో సుప్రీంకోర్టు పూర్తిగా పనిచేయకపోవడం సర్వసాధారణంగా జరిగేది. కాని ఈసారి ఆ సంప్రదాయాన్ని పక్కనపెడుతూ అత్యవసర కేసుల విచారణను సీజేఐ సూర్యకాంత్ నిర్వహించారు. సీజేఐ సూర్యకాంత్ స్వయంగా తానే రెండు సెషన్స్ నిర్వహించారు. డిసెంబర్ 22న జస్టిస్ జోయ్మాలా బాగ్చితో కలసి బెంచ్ నిర్వహించగా డిసెంబర్ 29న ముగ్గురు జడ్జిల ధర్మాసనానికి సీజేఐ సారథ్యం వహించారు.