Supreme Court | సీఏఏ అమలుపై స్టే కోరుతూ పిటిషన్లు.. విచారణకు అంగీకరించిన సుప్రీంకోర్టు
Supreme Court | కేంద్ర సర్కారు ఇటీవల నోటిఫై చేసిన ‘పౌరసత్వ సవరణ చట్టం (CAA)’ అమలుపై స్టే విధించాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు (Supreme Court) అంగీకరించింది. ఆ పిటిషన్లపై మార్చి 19న విచారణ జరపనున్నట్లు శుక్రవారం వెల్లడించింది.
న్యూఢిల్లీ: కేంద్ర సర్కారు ఇటీవల నోటిఫై చేసిన ‘పౌరసత్వ సవరణ చట్టం (CAA)’ అమలుపై స్టే విధించాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు (Supreme Court) అంగీకరించింది. ఆ పిటిషన్లపై మార్చి 19న విచారణ జరపనున్నట్లు శుక్రవారం వెల్లడించింది. సీఏఏ రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తీర్పు వచ్చే వరకు ఆ చట్టం అమలును నిలిపివేయాలని కోరుతూ కేరళకు చెందిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) ఇటీవల అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ల తదితర పొరుగు దేశాల నుంచి భారత్కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వాన్ని కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏను) తీసుకొచ్చింది. కేంద్ర హోంశాఖ ఇటీవలే ఆ చట్టాన్ని నోటిఫై చేసింది. అయితే దానిపై కొన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది రాజ్యాంగ విరుద్ధం, వివక్షాపూరితమైందంటూ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఈ చట్టం అమలును నిలిపివేయాలని తన పిటిషన్లో పేర్కొంది. అలాగే అత్యవసర విచారణ చేపట్టాలని కోరింది. ‘మంగళవారం దీనిపై వాదనలు వింటాం. మొత్తం 190కి పైగా కేసులు ఉన్నాయి. అన్నింటినీ విచారిస్తాం’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషనర్ల తరఫు న్యాయవాదులకు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

