‘నోట్ల రద్దు’ పిటిషన్లపై రేపు సుప్రీంకోర్టులో విచారణ
Supreme Court: నోట్ల రద్దు రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు రేపు వాదనలు విననున్నది. జస్టిస్ అబ్దుల్ నజీర్
న్యూఢిల్లీ: నోట్ల రద్దు రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు రేపు వాదనలు విననున్నది. జస్టిస్ అబ్దుల్ నజీర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పిటిషన్లపై రేపు విచారణ చేపట్టనున్నది. పిటిషన్లపై ప్రాథమిక వాదనలు విన్న అనంతరం ధర్మాసనం తిరిగి సమగ్ర విచారణ చేపట్టబోయే తేదీని ఖరారు చేసే అవకాశం ఉన్నది.
ప్రధాని నరేంద్రమోదీ 2016 సెప్టెంబర్ 8న పాత రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేశారు. పాత రూ.500 నోటుకు బదులుగా కొత్త నోటును తీసుకురాగా, పాత రూ.1000 నోటును పూర్తిగా రద్దుచేశారు. దాని స్థానంలో రూ.2000 నోటును తీసుకొచ్చారు. అయితే ఈ నోట్ల రద్దు కారణంగా జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగదు కోసం నిత్యం బ్యాంకుల ముందు బారులు తీరాల్సి వచ్చింది.
ఈ క్రమంలో నోట్ల రద్దును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. 2016, డిసెంబర్ 16న తదుపరి దర్యాప్తును రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీచేసింది. కానీ, రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుకు ఇప్పటిదాకా సమయం పట్టింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కరువు ముప్పుపై సర్కారు నిర్లక్ష్యం : చాడ కిషన్‌రెడ్డి
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

