న్యూఢిల్లీ: 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi) దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు ఇవాళ అంగీకారం తెలిపింది. 1947, ఆగస్టు 15వ తేదీ నాడు మతపరమైన స్థలాల అంశంలో ఎటువంటి చట్టం అమలులో ఉందో, అదే తరహా విధానాన్ని మెయిన్టేన్ చేయాలని ఆ పిటీషన్లో కోరారు. చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసులో విచారణ చేపట్టింది. ప్రార్థనా స్థలాలకు చెందిన కేసులతో లింకున్న వాటికి అసద్ పిటీషన్‌ను జోడించాలని సుప్రీం ఆదేశించింది. ఫిబ్రవరి 17వ తేదీ ఆ పిటీషన్‌పై విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎంపీ అసదుద్దీన్ తరపున అడ్వకేట్ నిజాం పాషా వాదించారు.
Supreme Court to hear plea by Asaduddin Owaisi to implement Places of Worship Act
Read story: https://t.co/fSYPrpqLGw pic.twitter.com/jlaPk32TUY
— Bar and Bench (@barandbench) January 2, 2025