న్యూఢిల్లీ, జూలై 31 : రోహింగ్యాలకు సంబంధించి విచారణలో సుప్రీం కోర్టు తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్లో రోహింగ్యాలు శరణార్థులా? అక్రమ చొరబాటుదారులా? అన్నది ముందు తేలాల్సి ఉందని అభిప్రాయపడింది. రోహింగ్యాలపై పిటిషన్ల విచారణ అంశాన్ని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ల ధర్మాసనం విచారణ జరిపింది.
భారత్ ఒకవేళ వారిని శరణార్థులుగా గుర్తిస్తే..వారికి హక్కు లు, రక్షణ కల్పించడానికి అవకాశముంటుందని, అక్రమ చొరబాటుదారులైతే.. వారిని బహిష్కరించేందుకు చేపడుతున్న చర్యలు చట్టబద్ధమేనా? అన్నది పరిశీలిస్తామని ధర్మాసనం చెప్పింది.