Supreme Court : ఢిల్లీలో వీధి కుక్కల పట్టివేత, తరలింపు అంశంపై నమోదైన పిటిషన్లను సుప్రీం కోర్టు (Supreme Court) రేపు తేల్చనుంది. ఆగస్టు 11న జారీచేసిన ఆదేశాల్లో వీధి శునకాలను శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలించాలని ఢిల్లీ ప్రభుతానికి స్పష్టం చేసింది. అన్ని వీధుల్లోంచి కుక్కలను పట్టుకొని.. వాటిని డాగ్ షెల్టర్స్(Dog Shelters)కు తరలించాలని మున్సిపల్ అధికారులకు తెలియజేసింది. సుప్రీం కోర్టు హుకూంతో అధికారులు చర్యలకు సిద్ధమవ్వగా.. జంతుప్రేమికులు మాత్రం అలా చేయొద్దంటూ మండిపడ్డారు.
బాలీవుడ్ నుంచి పలు రంగాలకు చెందిన సెలబ్రిటీలు సేవ్ స్ట్రీట్ డాగ్స్ అని నినదించడంతో ఆగస్టు 14న ఈ అంశం త్రిసభ్య ధర్మాసనం దగ్గరకు వచ్చింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజరియాలతో కూడిన ప్రత్యేక బెంచ్ తీర్పును వాయిదా వేసింది. దాంతో, ఈ విషయంపై అటు ఢిల్లీ ప్రభుత్వం.. ఇటు జంతు ప్రేమికుల వాదనలు విన్ని ఆగస్టు 22 శుక్రవారం తీర్పు ఇవ్వాలని సుప్రీం కోర్టు భావిస్తోంది.