మాకు అన్నీ తెలుసు.. ఈసీ నిర్ణయాలపై అన్ని అంశాలను పరిశీలిస్తాం: సుప్రీంకోర్టు
‘సర్' నిర్ణయాలు ఏకగ్రీవంగా తీసుకోలేదనే ఆరోపణలతో సహా ఈసీఐ పనితీరుకు సంబంధించి నెలకొన్న వివాదంలోని అన్ని అంశాలను పరిశీలిస్తామని సుప్రీంకోర్టు మంగళవారం పేర్కొంది. మాకు అన్నీ తెలుసు. మేము అన్నిటినీ పరిశీలిస్తాము అని సీజేఐ సూర్యకాంత్ తెలిపారు.
న్యూఢిల్లీ : ‘సర్’ నిర్ణయాలు ఏకగ్రీవంగా తీసుకోలేదనే ఆరోపణలతో సహా ఈసీఐ పనితీరుకు సంబంధించి నెలకొన్న వివాదంలోని అన్ని అంశాలను పరిశీలిస్తామని సుప్రీంకోర్టు మంగళవారం పేర్కొంది. మాకు అన్నీ తెలుసు. మేము అన్నిటినీ పరిశీలిస్తాము అని సీజేఐ సూర్యకాంత్ తెలిపారు. ఈసీఐ పనితీరును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సర్‌కు సంబంధించిన అన్ని నిర్ణయాలు ఏకగ్రీవంగా తీసుకున్నారని పేర్కొంటూ ఈసీఐ దాఖలు చేసిన అఫిడవిట్‌కు పిటిషనర్లు తమ కౌంటర్‌ను దాఖలు చేయడానికి వీలుగా సీజీఐ ఈ కేసు విచారణను నవంబర్ 17వ తేదీకి వాయిదావేశారు.
నిర్ణయాలు ఏకగ్రీవంగా తీసుకున్నారా లేదా అని నిర్ధారించడానికి కీలకమైన ఫైల్ నోటింగ్‌లు, ఈసీఐ అంతర్గత సంభాషణలను భద్రపరచాలని ఆదేశించాలని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, ఇండియా కూటమి నాయకుల తరఫున హాజరైన న్యాయవాది సింఘ్వీ ధర్మాసనాన్ని కోరగా సీజేఐ సూర్యకాంత్ ఈ వ్యాఖ్య చేశారు. ఈ మొత్తం వ్యవహారం నిర్ణయం తీసుకునే ప్రక్రియ, సంప్రదింపులు, తీసుకున్న నిర్ణయం ఏకగ్రీవంగా జరిగిందా లేదా అనే అంశాలపై ఆధారపడి ఉంటుందని సింఘ్వీ పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

