Pregnancy Termination | 26 వారాల గర్భం తొలగింపుపై ‘సుప్రీం’లో భిన్నాభిప్రాయాలు..!
Pregnancy Termination | 26 వారాల గర్భాన్ని తొలగించేందుకు ఓ మహిళకు ఇచ్చిన అనుమతిని రీకాల్ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం భిన్నమైన తీర్పును వెలువరించింది. సుప్రీంకోర్టు ద్విసభ్వ ధర్మాసనంలోని న్యాయమూర్తుల్లో ఒకరు గర్భవిచ్ఛిత్తికి అనుమతిపై విముఖత వ్యక్తం చేయగా.. మరో న్యాయమూర్తి సదరు మహిళ నిర్ణయాన్ని గౌరవించాలంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు.
Pregnancy Termination | 26 వారాల గర్భాన్ని తొలగించేందుకు ఓ మహిళకు ఇచ్చిన అనుమతిని రీకాల్ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం భిన్నమైన తీర్పును వెలువరించింది. సుప్రీంకోర్టు ద్విసభ్వ ధర్మాసనంలోని న్యాయమూర్తుల్లో ఒకరు గర్భవిచ్ఛిత్తికి అనుమతిపై విముఖత వ్యక్తం చేయగా.. మరో న్యాయమూర్తి సదరు మహిళ నిర్ణయాన్ని గౌరవించాలంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. జస్టిస్ బీవీ నాగరత్న, హిమా కోహ్లీ ధర్మాసనం కేసులో భిన్నమైన అభిప్రాయాన్ని తెలుపగా.. పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని జస్టిస్ డీవై చంద్రచూడ్ బెంచ్‌కు సిఫారసు చేయాలని కేంద్రం తరఫున వాదనలు వినిపించిన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి కోరారు.
అయితే, ఓ మహిళ తనకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారని, ప్రస్తుతం గర్భదాల్చడంతో అబార్షన్‌కు అనుమతించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తాను కుంగుబాటుతో బాధపడుతున్నానని, మూడోసంతానాన్ని సైతం పెంచేందుకు ఆర్థికంగా, మానసికంగా సిద్ధంగా లేనని కోర్టు ఎదుట వాపోయింది. పిటిషన్ వాదనలను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఎయిమ్స్ వైద్యుల నివేదిక మేరకు మహిళకు అక్టోబర్ 9న అబార్షన్‌కు అనుమతి ఇచ్చింది. అయితే, సదరు మహిళ గర్భం దాల్చి 25వారాలు దాటడంతో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే, మహిళలను పరిశీలించి వైద్యుల బృందం పిండం బతికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంటూ నివేదిక ఇచ్చింది.
కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అబార్షన్‌ను తాత్కాలికంగా వాయిదా వేయాలని ఈ నెల 10న వైద్యులను ఆదేశించింది. తాజాగా ఈ కేసును జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం సీజేఐ ధర్మాసనానికి కేసును సిఫారసు చేయగా.. బుధవారం విచారణ జరిపింది. అయితే, అబార్షతో మహిళలకు ఎలాంటి సమస్య ఉండదని వైద్యులు మొదట ఇచ్చిన నివేదికను కోర్టు ప్రస్తావిస్తూ.. తాజాగా ఇచ్చిన నివేదికపై అసహసనం వ్యక్తం చేసింది. గర్భంలోని శిశువు బతికి ఉండే అవకాశాలపై ఇంత ఖచ్చితత్వంతో మొదటే ఎందుకు చెప్పలేకపోయారంటూ అడిషనల్ సొలిసిటర్ జనరల్ ధర్మాసనం ప్రశ్నించింది. జీవమున్న గర్భస్థ శిశువు గుండె చప్పుడును ఆపాలని ఏ కోర్టు చెబుతుందని.. అలా ఏ కోర్టు చేస్తుందని హిమా కోహ్లీ అభిప్రాయపడ్డారు. అయితే, జస్టిస్ హిమా కోహ్లీ వ్యాఖ్యలతో విభేదిస్తున్నట్లు జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు. సదరు మహిళ నిర్ణయాన్ని గౌరవించాలన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
Madaram dispensary | మాదారం డిస్పెన్సరీ తరలింపు కుట్రను అడ్డుకుంటాం : మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
Pawan Kalyan | చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు రోడ్లపైకి వచ్చింది జనసైనికులే!.. కూటమిలో జనసేనదే ఎక్కువ త్యాగం.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

